కీలక భేటీ: పవన్ కల్యాణ్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.

Update: 2023-10-25 10:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు మెుదటి విడత జాబితాను విడుదల చేశాయి. అయితే తెలంగాణలో జనసేనతో పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వం వద్ద చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ వెళ్లింది. రెండు రోజులపాటు నేతలు ఢిల్లీలోనే ఉండి బీజేపీ అగ్రనేతలతో చర్చించి సీట్ల పంపకాలపై ఓ క్లారిటీకి రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్‌లు కలవనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై నేతలు చర్చించనున్నారు. ఇకపోతే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఇద్దరూ స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం ఉన్నారు. 

Tags:    

Similar News