Kapil Dev : ఏపీ సీఎంను కలిసిన కపిల్ దేవ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Nayudu)తో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) సమావేశం అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Nayudu)తో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన కపిల్ కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుతో ఆయన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అమరవతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్ఫ్ కోర్ట్(Golf Court) ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. క్రీడల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధితో క్రీడారంగానికి ప్రోత్సాహం అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం తాము ప్రారంభించి సగంలో నిలిచిపోయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు చంద్రబాబు సూచించారు. వీలైతే 2027 జాతీయ క్రీడలు కూడా ఏపీలో నిర్వహించేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం నూతన క్రీడా పాలసీని రూపొందించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. తాజాగా చంద్రబాబు కపిల్ దేవ్‌తో సమావేశంకావటంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల ప్రోత్సాహం దిశగా అడుగులు పడినట్లేనని భావిస్తున్నారు.