సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు.

Update: 2023-11-10 05:42 GMT
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌తోకలిసి కమల్ హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సినీరంగంలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్ కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో,ఇటు సేవ కార్యక్రమాలలో ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారు అని కొనియాడారు. ఎప్పుడు షూటింగ్‌లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషమన్నారు. నగర ప్రజల తరపున కృష్ణ ..మహేష్ బాబు అభిమానుల తరపున కమల్ హాసన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్‌కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున దేవినేని అవినాశ్ ప్రత్యేక ధన్యవాదాలు.

Tags:    

Similar News