Breaking: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తీర్పు రిజర్వ్

సీఎం జగన్‌పై గులక రాయితో దాడి కేసు తీర్పును విజయవాడ పోక్సో కోర్టు రిజర్వ్ చేసింది..

Update: 2024-05-27 10:39 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్‌లో వేముల సతీశ్ అనే యువకుడు గులక రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అయితే సతీశ్‌కు బెయిల్ కోరుతూ తాజాగా విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎదుట ఇరువర్గాల వాదనలు కొనసాగాయి. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించారని యువకుడి తరపున న్యాయవాది సతీం వాదనలు వినిపించారు. దీంతో సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా విజయవాడ సింగ్‌నగర్‌లో ఆయనపై గులకరాయితో దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఓ వ్యక్తిని వదిలేశారు. జగన్‌పై రాయి విసిరింది రెండో వ్యక్తి వేముల సతీశ్‌గా గుర్తించారు. అయితే మరో వ్యక్తి ప్రోద్బలంతోనే సతీశ్ రాయి విసిరినట్టు పోలీసులు రిమాండ్‌లో పేర్కొన్నారు. దీంతో సతీశ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సతీశ్ జైల్లోనే ఉన్నారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News