ఆ ఐపీఎస్‌లంతా కండిషన్‌ బెయిల్‌పై ఉన్నట్టే.. వారి కంటే మా పరిస్థితే బెటర్‌: జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి..వెయింట్ లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మోమోలు జారీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-14 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి..వెయింట్ లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మోమోలు జారీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. కానీ వారికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం.. IPSలకు డీజీపీ మెమోలు జారీ చేశారు. దీనిపై డీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కామెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్‌ అధికారులు ఉదయం, సాయంత్రం సంతకాలు పెట్టడం బాధాకరం మాపై కేసులు పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో.. అలాంటి పరిస్థితే ఐపీఎస్‌లకు రావడం దారుణం ఇప్పటికైనా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మారాలి. గత ప్రభుత్వం అండతో తప్పుచేసిన అధికారులు అందరూ కండిషన్‌ బెయిల్‌పై ఉన్నట్టే.. మేం ఉదయం సంతకం చేసి సాయంత్రం ఇంటికి వెళ్తాం, కానీ ఐపీఎస్‌లు మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. వారి కంటే మా పరిస్థితే చాలా బెటర్‌ అంటూ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.


Similar News