జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత.. కారణమిదే..!
విశాఖలో జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. ఉదయం 6.20 గంటలకు ట్రైన్ బయలు దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగిపోయింది. దీంతో స్టేషన్‌లోనే 2 బోగీలు వదిలి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ముందుకెళ్లింది. అయితే సిబ్బంది గమనించి జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ స్టేషన్‌కు తిరిగి తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.