AP:‘వైసీపీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’.. జనసేన నేత సెన్సేషనల్ కామెంట్స్!

గత వైసీపీ ప్రభుత్వం పై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(ఆదివారం) విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2024-10-06 09:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం పై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(ఆదివారం) విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ పై విమర్శలు గుప్పించారు.

ఆడారి ఆనంద్ విశాఖ డెయిరీ తమ అడ్డాగా చేసుకొని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. విశాఖ డెయిరీ లో పలు అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడారి ఆనంద్‌కి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. విశాఖ డెయిరీలో డైరెక్టర్స్ అందరూ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులేనని జనసేన నేత పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖ డెయిరీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని  మూర్తి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.


Similar News