సీట్ల సంఖ్య కంటే.. నాకు అదే ముఖ్యం: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సీట్ల సంఖ్యపై జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు,

Update: 2024-03-12 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సీట్ల సంఖ్యపై జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కల్యాణ్ ఇంత సంఖ్య సీట్లు తీసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. జనసేన శ్రేణులు సైతం సీట్ల కేటాయింపుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 21 సీట్లతో పవన్ కల్యాణ్ అసలు ఏం చేస్తారని.. సరే 24లో కనీసం ఓ 10 సీట్లు గెలిచిన.. ఆ 10 సీట్లతో ఆయన ఏం చేయగలరని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీట్ల సంఖ్యపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే తనకు ముఖ్యమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధికి కూటమి ఏర్పాటుతో బలమైన పునాది పడిందని దీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News