ఏపీలో అధికారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో అధికారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-02-19 14:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అధికారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జనసేన కూటమిదే అధికారమని, పార్టీ కోసం కృషి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విశాఖ నేతలతో భేటీ అయిన పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్లపై వివరణ ఇచ్చారు. కూటమిలో వచ్చే స్థానాలను మాత్రం చూడొద్దని పవన్ సూచించారు. అధికారంలోకి వచ్చాక అవకాశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందామని పవన్ పేర్కొన్నారు. వ్యక్తి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, జనసేన బలోపేతం కోసమే తాను అడుగులు వేస్తున్నానని పవన్ తెలిపారు. 

కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలను ఆయన కలవనున్నారు. పొత్తులు, సీట్లపై చర్చించనున్నారు. అనంతరం అధికారికంగా జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనాని దూకుడు పెంచారు. జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తలను నియమించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 22 తర్వాత ఆయన ఖరారు చేయనున్నారు. 

Also Read..

అనకాపల్లి శంఖారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు 

Tags:    

Similar News