జనసేన కుక్కలాగా అమ్ముడుపోయింది.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-19 12:49 GMT
జనసేన కుక్కలాగా అమ్ముడుపోయింది.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. మీ నాన్న చంద్రబాబే నా ముందు 22 సార్లు నిలబడ్డాడన్నారు. మీ నాన్న అపాయింట్‌మెంట్, నీ అపాయింట్‌మెంట్ నాకు కావాలా? అని ప్రశ్నించారు. బుద్ధి లేని వారే మీ(టీడీపీ) జెండాలు మోస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కేంద్రంలోని బీజేపీకి జనసేన, టీడీపీ, జగన్ తొత్తులయ్యారన్నారు. ప్రధాని మోడీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. స్మార్ట్ సిటీలు, కేపిటల్ సిటీ కట్టలేదని మండిపడ్డారు.

Read More..

జగన్ డైలాగ్‌కు మెగా బ్రదర్ నాగాబాబు పవర్‌ఫుల్ కౌంటర్

Tags:    

Similar News