విశాఖ దక్షిణలో జనసేన కుమ్ములాటలు.. పట్టించుకోని అధిష్టానం..
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన విబేధాలు కొట్లాటల వరకు వచ్చాయి.
దిశా ప్రతినిధి విశాఖపట్నం: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన విబేధాలు కొట్లాటల వరకు వచ్చాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైన వంశీకృష్ణ శ్రీనివాస్ బలహీనమైన అభ్యర్థి అంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు విశాఖ దక్షిణ కు కావాల్సింది బలి అయ్య మేకపోతు కాదు పోరాడే రేసుగుర్రం అంటూ వంశీని ఉద్దేశించి ఒక మేకపోతును తీసుకొచ్చి వినూత్న నిరసనకు దిగారు.
ఈ నేపధ్యంలో వారిని అడ్డుకునేందుకు వంశీకృష్ణ యాదవ్ వర్గీయులు ప్రయత్నించారు.దీనితో ఇరువర్గాల మధ్య మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి కొట్టుకుంటున్న కార్యకర్తలను అడ్డుకున్నారు. సాధిక్ కార్యాలయం వద్ద ఉన్న వీర మహిళలతో వంశీకృష్ణ యాదవ్ వర్గీయులు అసభ్యంగా ప్రవర్తించి ఒంటిపై చేతులు వేసి తమ వస్త్రాలను చింపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఈ వివాదాన్ని కారణం.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ ను సొంత నియోజకవర్గమైన విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా కాకుండా సంబంధం లేని దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా ఖరారు చేయడం వివాదానికి కారణమైంది. వంశీ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఆశావాహులకు ఆ విషయం చెప్పకుండా, సంప్రదింపులు సర్దుబాట్లు జరపకుండా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంటే.. జనసేన అధినేత ప్రేక్షక పాత్ర వహించడమే సమస్యను రోజురోజుకు పెంచుతుంది.
మూడు రోజులుగా వంశీ వ్యతిరేక వర్గీయులు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్నారు. మంగళవారం నాడు వంశీ ఫోటోలు తగలపెట్టి నల్ల బెలూన్ లు ఎగర వేశారు. విశాఖ తూర్పులో 50 వేల ఓట్లతో ఓడిపోయిన వంశీ తనకి సంబంధం లేదు దక్షిణలో ఎలా గెలుస్తాడంటూ వంశీ వద్దు పవన్ ముద్దు అన్న నినాదంతో సోమవారం నుంచి నిరసనలు ప్రారంభించారు.
ఇంత జరుగుతున్న అధిష్టానం జోక్యం చేసుకోకుండా ఎవరితో మాట్లాడకుండా వదిలేయటం పరిస్థితి దిగజారటానికి మరింత కారణమైంది. ఇక ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చి టికెట్ పొందిన వంశీ నియోజకవర్గంలోని నేతలతో చర్చలు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలి. అయితే అందుకు భిన్నంగా అసమ్మతి నేతలపై ప్రతిదాడులకు దిగడం సమస్యను మరింత పెంచుతోంది. జనసేనకు విశాఖలో పీఏసీ సభ్యుల వంటి సీనియర్ నేతలు ఉన్న జోక్యం చేసుకోకపోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
Read More..
Breaking: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ గూటికి వైసీపీ ప్రముఖ నేత