‘ఇకపై చూపిస్తా’.. NDA కూటమి విజయంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చీకటి రోజులు ముగియశాయని.. ఇది రాష్ట్ర చరిత్రలో చార్రిత్మమైన రోజని అన్నారు. మార్పు కావాలన్నది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని.. అది ఇవాళ సాధ్యమైందన్నారు. ఇక, జగన్ నాకు వ్యక్తిగత శత్రువు కాదని, ఆ పార్టీ నేతలపై ఎలాంటి ప్రతికార చర్యలు ఉండవని పవన్ స్పష్టం చేశారు.
ఇది కక్ష సాధింపు సమయం కాదని, ఏపీని అభివృద్ధి చేయాల్సిన సమయం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. తాను ప్రజల్లో ఎంతగా ఉన్నానో 21 స్థానాల్లో గెలిచే వరకు నాకే తెలియదని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాల్సి ఉంటుందన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించామని, 175 స్థానాల్లో గెలిస్తే ఎలా పని చేస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా పని చేస్తామని తెలిపారు. నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, రైతులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తనకు ఎంతో బాధ్యత ఇచ్చిందని, అహంకారం కాదని అన్నారు. రాష్ట్రంలో పాలన, శాంతి భద్రతలు ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.