AP News: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల భర్తీ

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ జరిగింది. ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏ (AP CRDA)లో పోస్టింగులు ఇవ్వగా.. ప్రోటోకాల్ డైరెక్టర్ గా టి.మోహన్ రావును నియమించారు.

Update: 2024-10-29 05:45 GMT
AP News: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల భర్తీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి భారీగా అధికారులను బదిలీ చేసింది. 32 మంది డిప్యూటీ కలెక్టర్లను (AP Deputy Collectors Transfers) బదిలీ చేస్తూ.. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Neerabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏ (AP CRDA)లో పోస్టింగులు ఇవ్వగా.. ప్రోటోకాల్ డైరెక్టర్ గా టి.మోహన్ రావును నియమించారు. ఏపీఐఐసీ (APIIC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పి. రచన, శ్రీకాళహస్తి దేవాలయం (Srikalahasti Temple) ఈఓగా టి. బాపిరెడ్డిని, ఏపీ శిల్పారామం సొసైటీ (AP Silparamam Society) సీఈఓగా వి.స్వామినాయుడును నియమించారు. సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా డి. లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

Tags:    

Similar News