Nagarjuna Sagar:‘జలసవ్వడి’ నాగార్జునసాగర్ గేట్లు అన్ని ఎత్తివేత..పర్యాటకుల కేరింతలు!
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువనుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
దిశ ప్రతినిధి,నరసరావుపేట:నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువనుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2,74,065 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని కిందకు వదులుతున్నారు. రెండేళ్ల తర్వాత మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. సాగర్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.