తుదిశ్వాస వరకు జనసేనలోనే ఉంటా.. టికెట్ ఆశించిన కీలక నేత ప్రకటన

జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి సూర్యచంద్ర భావోద్వేగానికి గురయ్యారు. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో అచ్యుతాపురం దుర్గాదేవి ఆలయం ఎదుట శనివారం సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

Update: 2024-02-24 14:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి సూర్యచంద్ర భావోద్వేగానికి గురయ్యారు. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో అచ్యుతాపురం దుర్గాదేవి ఆలయం ఎదుట శనివారం సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ స్పందించి న్యాయం చేసేవరకు ప్రాణం పోయినా ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. నా తుదిశ్వాస వరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. రబ్బర్ చెప్పులు వేసుకునే వారు అసెంబ్లీకి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. సామాన్యులు టికెట్ కోరుకోవడం తప్పా అని అడిగారు.

శనివారం టీడీపీ-జనసేన కూటమి తమ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో ఏపీలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఫస్ట్ లిస్ట్ పేరుతో టీడీపీ ఏకంగా 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 24లో కేవలం ఐదుగురినే ప్రకటించింది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా తమ కూటమి తరుఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలో టికెట్ ఆశించిన టీడీపీ, జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.

Tags:    

Similar News