AP News : జగన్ చెత్త రోడ్ల వలనే రోడ్డు ప్రమాదాలు : జనసేన నేత కిరణ్ రాయల్
జగన్ వేసిన చెత్త రోడ్ల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : జగన్ వేసిన చెత్త రోడ్ల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) మండిపడ్డారు. ఏపీలో గేమ్ ఛేంజర్(Game Changer) ప్రీరిలీజ్ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రీరిలీజ్ ఫంక్షన్ అనంతరం జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని అభిమానులకు పవన్ కళ్యాణ్(Pavan Kalyan) 50 సార్లు చెప్పారన్నారు. ఏపీలో రోడ్లు భలేకే అర్థరాత్రి సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్నారు. చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో జగన్ ఆడుకున్నారని మండిపడ్డారు. జగన్ ఇంట్లో హత్యకు గురైన బాబాయి కేసు సంగతి ఏమైందని కిరణ్ ప్రశ్నించారు. ముందు ఆ కేసు నిందితులను పట్టుకొని ఆ తర్వత మా గురించి మాట్లాడడండని ఎద్దేవా చేశారు. మృతి చెందిన యువకుల కుటుంబాలకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలియ జేశారు.