ఘోర ఓటమి తర్వాత తొలిసారి ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఈవీఎంలపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు.

Update: 2024-06-18 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఈవీఎంలపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ‘న్యాయం అందించడమే కాదు.. అందించినట్లు స్పష్టం కనిపించాలి.. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటం మాత్రమే కాదు నిస్సందేహంగా అది ప్రబలంగా ఉన్నట్లు కనిపించాలి.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. ఈవీఎంలను వినియోగించడం లేదు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి..’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈవీఎలపై ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆనాడు జగన్ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని.. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని తేల్చి చెప్పడం గమనార్హం.


Similar News