జగన్ సర్కార్ కీలక నిర్ణయం: స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జిపై వేటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-11-07 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జి ఆర్‌.హరిప్రకాశ్‌పై వేటు వేసింది. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆర్ధిక శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరిప్రకాశ్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం అదేశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌ విజయభారతికి స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపోతే గత కొంతకాలంగా వేధింపులు, అక్రమ బదిలీలపై ఆర్‌.హరిప్రకాశ్‌పై గత కొంతకాలంగా ఆడిట్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్‌.హరిప్రకాశ్‌ను స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌గా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News