BREAKING: ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని

Update: 2024-06-04 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపినట్లు సమాచారం. కాగా జగన్ నేతృత్వంలోని వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో 153 ఎమ్మెల్యే సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జగన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ సారి వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ కదనరంగంలో చితకిలపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ ఓడని విధంగా ఓటమి చవి చూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 9 సీట్లుకే పరిమితమైన ఊహించని ఓటమిని మూటగట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. 


Similar News