Tirumala:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్‌కు ఆహ్వానం

ఏపీలో తిరుమల(Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు వైభవంగా జరగనున్నాయి.

Update: 2024-09-27 02:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల(Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ అర్చకులు డిప్యూటీ సీఎం పవన్‌కు ఆశీర్వచనం ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే ఉత్సవాల్లో తొలి రోజైన అక్టోబర్ 4వ తేదీ ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణ రథం, అక్టోబర్ 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం అంగరంగ వైభవంగా జరుగుతాయి.


Similar News