ప్రచారంలో దూసుకెళ్తున్న తనయులు

రాబోయే ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటును దక్కించుకోవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

Update: 2024-04-25 02:42 GMT

దిశ, చంద్రగిరి: రాబోయే ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటును దక్కించుకోవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు వినీల్ తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి పులివర్తి నాని అయినప్పటికీ తనే ఎంఎల్ఎ అభ్యర్థి ఆన్న చందాన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో తన తండ్రికి జరిగిన పరాజయాన్ని దృష్ట్యా గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి పులివర్తి నాని ఇస్తున్న హామీలకు జతగా మరికొన్ని హామీలను పులివర్తి వినిల్ సైతం ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జనసేన సైతం..

అలాగే తిరుపతి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులను గెలిపించాలని వారిద్దరూ కుమారులు జగన్, మదన్ సైతం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ నీ ఓడించాలని వారే ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్లుగా ప్రచార వైకుంఠపాళి ప్రారంభించారు. భూమన అభినయ్ విరివిగా ఉపయోగిస్తున్న ఆరోపణ అయినటువంటి నాన్ లోకల్ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దు అన్న ప్రచార అస్త్రాన్ని తిప్పికొట్టడానికి సాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎం.ఎల్. ఏ అభ్యర్థి ఎవరైనా సరే వారి చిన్న బాబు(సార్)లే తమని తాము ఎమ్మెల్యే అభ్యర్థులుగా అనువయించుకుంటూ ప్రచారంలో పాలు పంచుకుంటూ తమ పోటీ అభ్యర్థులను మట్టి కరిపించాలని కంకణబద్ధులై ఉన్నారు.


Similar News