Breaking:కూటమికి ఓటేస్తే పథకాలన్ని ముగిసిపోతాయి: సీఎం జగన్

రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉడడంతో పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ 17 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

Update: 2024-04-19 12:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉడడంతో పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో  సీఎం జగన్ 17 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. శుక్రవారం 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో నిర్వహించారు. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటి లేదన్నారు. 2014లో ఇదే ముగ్గురు కలిసి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు..అవి చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆడబిడ్డ పుడితే 25 వేలు అకౌంట్‌లో వేస్తామన్నారు వేశారా? రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? అని ధ్వజమెత్తారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటున్నారు. నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నే తాము గెలిస్తే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే పథకలు రద్దు చేస్తారని చెప్పారు. మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. మీరు వేసె ఓటే ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ తెలిపారు.

Read More...

బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.. కాకినాడ సభలో సీఎం జగన్ సెటైర్లు 

Tags:    

Similar News