పవన్ కల్యాణ్‌కు చెప్దామంటే అపాయింట్మెంట్ దొరకడం లేదు : కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-08-07 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మద్దతు దారులతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీమంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అన్నారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇస్తే బట్టలు ఊడతీసి నడి రోడ్డుపై నిలబెడతామని తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం మాజీమంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నమ్మవద్దని పవన్ కల్యాణ్‌కు సూచించారు. చంద్రబాబును నమ్ముకుంటే జనసేనానికి ఎన్టీఆర్‌కు పట్టిన గతే పడుతుందని స్ట్రాంగ్‌గా హెచ్చరించారు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. టీడీపీ దొంగలను, 420లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టాలని మాజీమంత్రి కొడాలి నాని సూచించారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు స్వయంగా కలిసి చెప్దామని ప్రయత్నించానని కానీ అపాయింట్మెంట్ లభించలేదని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.

చంద్రబాబువి సొల్లు కబుర్లు

ప్రతీ ఎన్నికల్లో ఎవరినో ఒకరిని వాడుకోవడం ఆ తర్వాత వెన్నుపోటు పొడవటం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అలవాటు అని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కల్యాణ్‌‌ను కూడా వాడుకొని వెన్నుపోటు పొడవడం ఖాయమని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత వాడి వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరాడని అనంతరం ఆయనకే వెన్నుపోటు పొడిచారని మాజీమంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై టీడీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమీ ఒరగబెట్టలేని చంద్రబాబు నాయుడు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ఇప్పుడు సొల్లు కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో దేవినేని ఉమ ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాకుండా బ్రోకర్ గా పనిచేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేశారని మాజీమంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దాన్ని కేంద్రం పూర్తి చేయాల్సి ఉండగా...చంద్రబాబు ఎందుకు చేతుల్లోకి తీసుకున్నాడని నిలదీశారు. చంద్రబాబుకు 70ఏళ్లు దాటాయని అందువల్లే మైండ్ సరిగ్గా పనిచేయడం లేదని మాజీమంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Read More: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పొలిటికల్ పంచులపై స్పందించిన హరీష్ శంకర్.. మూడిందన్నట్టుగా ట్వీట్!

Tags:    

Similar News