తెల్ల రేషన్ కార్డున్న మహిళలు, పురుషులకు భారీ గుడ్ న్యూస్.. ఉచితంగానే..!!

ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-07 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ స్కీంలు ఏవి అప్లై చేసుకోవాలన్న రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. తాజాగా రేషన్ కార్డు ఉన్న ఇంట్లో మహిళలకు, పురుషులకు ఓ సంస్థ గుడ్‌న్యూస్ అందించింది. ఈ రోజుల్లో బాగా ట్రెండింగ్ లో ఉన్నది కంప్యూటర్. కంప్యూటర్ ద్వారా పనులను వేగవంతం చేస్తూ నిమిషాల్లో గణాంకాలను లెక్కించొచ్చు. ఇలా ప్రస్తుతం ప్రతి పని కంప్యూటర్ రంగంపై ఆధారపడుతూ జరుగుతున్నది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి రంగాన్ని మహిళలకు చేయుతగా మార్చేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి యూనియన్ బ్యాంకు ఉపాధి శిక్షణ సంస్థ కింద జూన్ 10 నుంచి 30 వ తారీకు వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందుకోసం తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులని వెల్లడించారు. దీనికోసం 10 వ తరగతి పూర్తి చేసి ఉంటే చాలు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధ్రువ పత్రాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా వెంటనే ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని సంస్థ డైరెక్టర్ కోరారు. అలాగే మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11-48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలని కోరారు. 


Similar News