AP:ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..అప్పులు ఎంతంటే?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-07-10 13:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై కూడా సీఎం ఆరా తీశారు. ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు? ప్రస్తుతం అప్పులు ఎంత ఉన్నాయి? అని సీఎం ఆరా తీశారు. బుధవారం ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై ఆరా తీశారు. ఈ సమీక్షలో మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం.


Similar News