బ్రేకింగ్ న్యూస్.. హోంమంత్రి అనితకు తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వాయ్ వెళ్తుండగా బైక్ అడ్డం వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వాయ్ వెళ్తుండగా బైక్ అడ్డం వచ్చింది. ఈ క్రమంలో బైకర్ ను తప్పించుకు కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం సడెన్ బ్రేక్ వేసింది. ఈ క్రమంలో వేగంలో ఉన్న హోంమంత్రి కారు ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా హోంమంత్రి అనితకు ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మరో వాహనంలో హోంమంత్రి అనిత అలంపురం వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.