షూటింగ్‌లో అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్
హీరో నందమూరి బాలకృష్ణను కర్నూలు జిల్లాలో ఓ అభిమాని కలిశారు..
దిశ, వెబ్ డెస్క్: హీరో నందమూరి బాలకృష్ణను కర్నూలు జిల్లాలో ఓ అభిమాని కలిశారు. దీంతో అభిమానితో కలిసి భోజనం చేశారు. తన 107వ సినిమా షూటింగ్‌లో బాలయ్యా ఉన్నారు. అయితే అక్కడికి ఆదోనికి చెందిన బాలయ్య అభిమాని సజ్జద్ తన కుమారుడితో కలిసి షూటింగ్ సెట్ వద్దకు వెళ్లారు. తన అభిమాన నటుడు బాలయ్యను కలవాలని కోరారు. దీంతో సెట్స్‌లో ఉన్న బాలయ్యకు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఓకే చెప్పడంతో బాలయ్య వద్దకు అభిమానిని తీసుకెళ్లారు. దాంతో అభిమానిని బాలయ్య అప్యాయంగా పలకరించారు. సజ్జద్ కుమారుడి గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఈ సందర్భంగా సజ్జద్ కు బాలయ్య సూచించారు. అనంతరం అభిమానితో కలిసి బాలయ్య భోజనం చేశారు. దీంతో అభిమాని సజ్జద్ ఆనందం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరోను కలవడం సంతోషంగా ఉందన్నారు. బాలయ్యతో కలిసి భోజనం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అభిమాని సజ్జద్ తెలిపారు.