శ్రీశైలంలో దంచికొట్టిన భారీ వర్షం.. విరిగిపడిన కొండచరియలు

సోమవారం రాత్రి నుంచి శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తుంది.

Update: 2024-08-21 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం రాత్రి నుంచి శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున, అర్ధరాత్రి భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో శ్రీశైల పుణ్యక్షేత్రం లో అన్ని రహదారుల్లో వరద నీరు భారీగా ప్రవహించింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే.. శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై బండరాళ్లను అడ్డంగా పడటంతో ఉదయం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంటనే బండరాళ్లను పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఉదయం కూడా వర్షం కురుస్తుండడంతో మరోసారి కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని.. వాహనదారులు చూసుకుని వెళ్లానని అధికారులు ప్రజలను, సందర్శకులను, భక్తులను అప్రమత్తం చేశారు.


Similar News