దళిత అధికారులపై వేధింపులు: భీమ్ సేన నేత రవి సిద్ధార్థ

రాష్ట్రంలో దళితులు ఏ హోదాలో ఉన్నా కులం కారణంగా వివక్షకు గురి అవుతున్నారని భీమ్ సేన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎం. రవి సిద్ధార్థ పేర్కొన్నారు.

Update: 2023-05-08 11:18 GMT

దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రంలో దళితులు ఏ హోదాలో ఉన్నా కులం కారణంగా వివక్షకు గురి అవుతున్నారని భీమ్ సేన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎం. రవి సిద్ధార్థ పేర్కొన్నారు. ఆయన సోమవారం విశాఖలోని రేసపు వానిపాలేం దగ్గర అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వయం గౌరవంతో విధి నిర్వహణలో అధికారులు అనేక అవమానాలకు గురి అవుతున్నారన్నారు. కడప జిల్లాలో అచ్చెన్న హత్య నేపధ్యాల నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట వేధింపులు తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు.

ఇటు జీవీఎంసీ కమీషనర్‌గా విధులు నిర్వహించిన రాజాబాబు వరకు అందరూ దీనిలో బాధితులే అని తెలిపారు. దళితులు అధికారులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళపై అవినీతి ఆరోపణలు చేస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఇదొక రకమైన ఎట్రాసిటీ అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. మీడియా సమావేశంలో భీమ్ సేన అధ్యక్షుడు జే. ఓంకార్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు జీ.శివకుమార్, సీహెచ్. శ్రీకాంత్, ప్రసాద్ మాస్టర్, కోశాధికారి ఎం. పైడిరాజు, వీరన్న, రాము, సర్వేశ్వరరావు, అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News