Teachers Day Wishes:ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్

ఈ రోజు(సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2024-09-05 09:37 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఈ రోజు(సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటామని తెలిపారు. ‘సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయం. దేశానికి జ్ఞాన సంపన్నులైన, అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల, కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తపిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు ఉపాధ్యాయులు గౌరవ మర్యాదలను ఈ ప్రభుత్వం కాపాడుతుంది అని ప్రకటన విడుదల చేశారు.


Similar News