Skill Case: హైకోర్టులో విచారణ ప్రారంభం.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..? రాదా...!

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది....

Update: 2023-10-30 06:29 GMT

 దిశ, వెబ్ డెస్క్:  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు రోస్టర్‌లో మార్పులు జరిగిన తర్వాత తాజాగా జస్టిస్ మల్లికార్జునరావు ధర్మసనం ఈ కేసు విచారణను చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు, సీఐడీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే 50 రోజులకు పైగా చంద్రబాబు జైలు జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టును సైతం జత చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యులపై ప్రభావం ఉంటుందని సీఐడీ అధికారులు అంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు. ఇరువురి వాదనల విన్న తర్వాత కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News