కేంద్ర బడ్జెట్‌పై జనసేన రియాక్షన్.. ఆ పథకంపై కీలక ప్రకటన

Update: 2024-02-01 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను జనసేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ గురువారం మీడియాతో మాట్లాడారు. కరెంట్ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్ పథకం చాలా మంచిదని ఆయన తెలిపారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడమేనది గొప్ప విషయంగా పేర్కొన్నారు. అంత్యోదయ పథకాన్ని 2029 వరకూ పొడిగించడంపై ఆయన కేంద్రప్రభుత్వాన్ని అభినందించారు. మహిళలను లక్షాధికారిని చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం చేయూతనిస్తోందని చెప్పారు పర్యాటక రంగానికి కూడా కేంద్రం అండగా నిలబడుతోందన్నారు. భారత్‌లో మరిన్ని మెట్రోలకు శ్రీకారం చుట్టడంపైనా నాదెండ్ల మనోహన్ అభినందించారు.

కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక‌సభ వేదికగా మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, వాటి విడిభాగాల భాగాలపై దిగుమతి సుంకాన్ని దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతం తగ్గించనున్నట్లు పేర్కొంది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అటు ఆధ్యాత్మిక, టూరిజం డెవెలప్‌మెంట్‌ను ప్రోత్సహించేందకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యున్నత టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేందుకు వడ్డీ లేని రుణాలు, ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించనున్నట్లు నిర్మలా పేర్కొన్నారు.

జీడీపీ అంటే తమ ప్రభుత్వం దృష్టిలో వేరే అర్ధం ఉందని, అది గవర్నెన్స్, డెవలప్ మెంట్, పర్ఫార్మెన్స్ అని కొత్త అర్ధాన్ని నిర్మలా సీతారామన్  తెలిపారు. అలాగే దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని, మద్దతు ధర, పెట్టుబడి సాయంతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే డెయిరీ రైతుల సమగ్రాభివృద్దికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు.

Tags:    

Similar News