Ap News: థర్మల్ కేంద్రాలపై సీఎం జగన్ కీలక నిర్ణయం
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో థర్మల్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర జెన్‌కో ప్లాంట్లకు సుల్యారీ గనుల నుంచి బొగ్గు సరఫరాపై ఏపీ ఎండీసీ, జెన్‌కో అధికారులతో ఆయన చర్చించారు. ఏపీజెన్‌కో ఆధ్వర్యంలో కోల్ మైన్స్ ప్రాంతంలోనే ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఏపీ ఎండీసీ ద్వారా బొగ్గు వెలికితీత, జెన్‌కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. సీఎం జగన్ ఆలోచనలతో ఇంధనం రంగం పురోగతిలో ఉందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇకపై థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.