కరెంట్, రోడ్ల పంచాయితీ, .. సీఎం కేసీఆర్‌కు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలోని రోడ్లు, కరెంట్ సమస్యలు, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.....
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని రోడ్లు, కరెంట్ సమస్యలు, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కోసమే కేసీఆర్ పొరుగు రాష్ట్రాలపై విమర్శలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఏపీలో విలీమైన ఏడు మండలాల ప్రజలు తెలంగాణకు వెళ్లమని చెబుతున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్నవే కాదు.. లేనివి కూడా చెప్పాలని హితవు పలికారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తమకు జగన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో పింఛన్లు అద్భుతంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌కే చెప్పారని సజ్జల గుర్తు చేశారు. ప్రైవేటు వ్యాపారం చేసుకునే వాళ్లే చంద్రబాబు ర్యాలీలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. రోగం వచ్చిందని చంద్రబాబు కోర్టును మోసం చేశారని ఆరోపించారు. రోగం వస్తే 14 గంటల పాటు కారులో చంద్రబాబు ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. అన్ని సర్వేల్లో 60 నుంచి 70 మంది ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.