మంత్రి లోకేష్ చొరవ.. గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం
గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం అయింది..
దిశ, అమరావతి: కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం నారా లోకేష్ నైజం. ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు సుఖాంతమైంది. తాజాగా అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి, తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. శివ చేసిన వీడియోలో తాను ఎక్కడనుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్‌ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో రెండురోజులపాటు గాలించిన గల్ఫ్ టిడిపి విభాగం నాయకులు... ఎట్టకేలకు శివ అడ్రస్‌ను గుర్తించి అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.
బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడుతూ... మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని, తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన మరువలేనని కన్నీళ్ల పర్యంతమయ్యారు. శివ స్వస్థలానికి చేరడానికి సహకరించిన లోకేష్ కు ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ... మంత్రి లోకేష్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించి శివ కథను సుఖాంతం చేసిన మంత్రి లోకేష్‌పై ప్రసారమాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లోకేష్ పని తీరు నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నప్రజల కోసం ఎందాకైనా వెళ్లి ఆపన్నహస్తం అందించే మీ కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్ అంటూ బాలాజీగుప్తా అనే నెటిజన్ లోకేష్‌ను అభినందించారు