Breaking News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి...

Update: 2024-08-17 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మొత్తం 12 శాఖలో బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖల్లో తొలుత బదిలీలు చేపట్టేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లైయ్, గనులు, పంచాయతీ రాజ్ శాఖ, ఇంజినీరింగ్ విభాగాల్లో అధికారులను బదిలీ చేయనుంది. ఐదేళ్లు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పని సరిగా బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో మరికొద్ది రోజుల తర్వాత బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags:    

Similar News