AP News:గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. జీతాల పై ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం(AP Government) తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన జీతాల పై కీలక ప్రకటన చేసింది.

Update: 2024-11-14 08:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Government) తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన జీతాల పై కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ శాఖ(Department of State Secretariat) ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని తాజా నిర్ణయంలో మరోసారి అమలు చేయనున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఎన్నికల ముందు నిలిపివేశారు. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం బయో మెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉండేది.. కానీ కొన్ని సమస్యల కారణంగా ఈ విధానాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.

Tags:    

Similar News