AP Government:గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.1500
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ (Super Six)పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్((AP Budget)లో నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ‘ఆడబిడ్డ నిధి’కి బడ్జెట్‌లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు ప్రతిపాదించింది. జెండర్ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.