మహిళలకు, నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే అకౌంట్లలో డబ్బులు!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్నారు.

Update: 2024-06-07 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు కొత్త స్కీం ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్లలో వేయాలని నిర్ణయించింది. కాగా సంవత్సరానికి 18,000 అందనున్నాయి. అంతేకాకుండా టీడీపీ మేనిఫెస్టోలో కీలక పథకాలు కూడా ప్రకటించింది. మెగా డీఎస్సీ ఫైల్‌పై ఫస్ట్ సంతకం, సామాజిక పింఛన్లు రూ. 4000 లకు పెంపు, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు, దివ్యాంగులకు రూ. 6000 పింఛన్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బీసీలకు 50 ఏళ్లకే 4 వేల పింఛన్, యువతకు సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ హామీ ఇచ్చింది. కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. వరుసగా తాము ఇచ్చిన పథకాన్నీ నేరవేర్చనున్నారని ప్రజలు నమ్మకంగా ఉన్నారు.


Similar News