భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇకపై రాష్ట్రంలో అది ఫ్రీ, రేపే అమల్లోకి!

మట్టి, ఇసుక అక్రమ రవాణాలపై అధికారులు తరచూ ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు.

Update: 2024-07-07 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: మట్టి, ఇసుక అక్రమ రవాణాలపై అధికారులు తరచూ ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఇసుక దందా ఎక్కువగా జరుగుతుంది. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలని సుప్రీంకర్టు పలు మార్లు ఆదేశించింది కూడా. అక్రమ రవాణాలు జరుగుతున్న స్థలాల్లో అధికారుల బృందాలను పంపి, నిలిపివేయాలని నిర్దేశించింది. రీసెంట్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ వైసీపీ నిర్ణయాలకు పూర్తిగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ చెత్త పన్ను వేయగా.. సీఎం చంద్రబాబు రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇక నదుల్లో, సముద్రాల్లో దొరికే ఇసుకను వైసీపీ సర్కారు అమ్ముకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఉచిత ఇసుక విధానం జులై 8 వ తారీకు నుంచి అమలులోకి రానుంది. సర్కారు ప్లాన్ ప్రకారం.. తొలుత అన్ని చోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులోనున్న ఇసుకను ఫ్రీగా అందిస్తారు. ఇక నిర్వహణ ఖర్చుల కోసం టన్నుకు రూ 20. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తామని కూటమి సర్కారు ప్రకటించింది. అలాగే నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. నదులు, వాగులు, వంకల్లో ఇసుక తవ్వుకోవచ్చు. ఎడ్ల బండ్ల ద్వారా ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లొచ్చు.


Similar News