AP News: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం

వరదల్లో నష్టపోయిన వరి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

Update: 2024-09-11 09:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు (Rains, Floods) వచ్చిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు, వరదల దెబ్బకు చాలా ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది. వరద నీటిలో పంటలు కొట్టుకుపోయాయి. వరి పంట పూర్తిగా నీటి పాలైంది. ఉద్యానవన పంటలు ధ్వంసమయ్యాయి. బుడమేరు వాగు విజయవాడ (Vijayawada) వాసులను చిన్నాభిన్నం చేసింది. చివరకు అపరనష్టం మిగిలింది. వరదలు తగ్గుముఖం పట్టంతో బాధితులకు ఈ నెల 17లోపు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం (Government) కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు (Cm Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో పర్యటించిన ఆయన.. వరదల్లో నష్టపోయిన వరి రైతులకు (Farmers) గుడ్ న్యూస్ తెలిపారు. వరికి ఎకరాకు రూ. 10 వేలు పరిహారం అందజేస్తామని చంద్రబాబు వెల్లడించారు.


ఏలూరు జిల్లాలోని ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదల నివారణకు చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. పోలవరంతో నదులు అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. వాతావరణంలో జరిగిన మార్పులతో భారీగా వరదలు వచ్చాయన్నారు. బుడమేరు గండ్లు పూడ్చకపోవడంతోనే విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదల వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. 


Similar News