అంగన్వాడీలకు భారీ గుడ్న్యూస్ అందించిన ప్రభుత్వం.. ప్రమోషన్లతో పాటు
ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లకు తాజాగా శుభవార్త అందించింది
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లకు తాజాగా శుభవార్త అందించింది. జగన్ ఇప్పటికే పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. అయితే వారిని కార్యకర్తలుగా నియమించేందుకు అర్హత వయసును తాజాగా జగన్ ప్రభుత్వం పెంచింది. కాగా 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధలను అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ నిర్వహించాలని వెల్లడించింది. కాగా విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేసింది.