చంద్రబాబు మెడకు ఉచిత ఇసుక కేసు: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును వరుస కేసులు వెంటాడుతున్నాయి.

Update: 2023-11-07 09:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అనేక కేసులతో చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారు. ఇవి సరిపోవు అన్నట్లు ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లింది అంటూ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఏపీ హఐకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ తనపై మోపిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించడం భావ్యం కాదన్నారు. ఉచిత ఇసుక విధానంపై కేబినెట్‌లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు ఖండించారు. తనపై ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కేబినెట్‌లో చర్చించలేదని సీఐడీ ఆరోపణ

చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను సీఐడీ చేర్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం వల్ల ఇసుక పాలసీపై కేసు నమోదు చేసింది. ఇకపోతే ఉచిత ఇసుక అంశాన్ని కేబినెట్‌లో చర్చించలేదని సీఐడీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News