Free gas: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Update: 2024-10-25 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే ఉచిత ఇసుక(Free sand)ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం దీపావళి(Diwali) కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్(Free gas cylinder) పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఉచిత గ్యాస్ సిండర్లను పొందాలనుకునే లబ్ది దారులు.. ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్పష్టం చేశారు. కాగా ఈ పథకం అమలుకు లబ్ధిదారులకు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారని ఆయన తెలిపారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 31 లోపు ఎప్పుడైనా మొదటి సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి ప్రభుత్వ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.


Similar News