వైసీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.అయితే శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాత్రి సమయంలో

Update: 2023-02-18 02:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.అయితే శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాత్రి సమయంలో ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం, వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News