వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరో బిగ్ షాక్..!
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. కారంపూడిలో సీఐ నారాయణ స్వామిపై, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసుల పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి కోర్టు14 రోజులు రిమాండ్ విధించింది. రెండు కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కి న్యాయస్థానం రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలు కు తరలించింది. పిన్నెల్లి అరెస్ట్ తో మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు సరైన శాస్తీ జరిగిందంటూ వైసీపీ లోని ఓ వర్గం తెగ సంబరపడిపోతుంది. కోర్ట్ కు తరలిస్తున్న సమయంలో పిన్నెల్లి టీడీపీ కార్యకర్తను పొట్టలో గుద్దాడు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఇప్పటికి పరారిలో ఉన్నాడు.