మాజీ మంత్రి రోజా ట్వీట్.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగిక దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి రోజా పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు.

Update: 2024-10-09 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగిక దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి రోజా పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు.

పవన్‌కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసిన రోజా.. దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామి అంటూ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో రోజా ట్వీట్‌పై డిప్యూటీ సీఎం స్పందించారు. పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన అఘాయిత్యం బాధ కలిగిందన్నారు. స్థానికులు అప్రమత్తమై నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారని, ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను అని పవన్ చెప్పారు. అలాగే బాధితురాలిని ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Tags:    

Similar News