నా కూతుర్ని వేధిస్తున్నారు: మాజీ మంత్రి రోజా తీవ్ర ఆవేదన
తన కూతుర్ని వేధిస్తున్నారని మాజీ మంత్రి రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తన కూతురుని వేధిస్తున్నారని మాజీ మంత్రి రోజా(Former minister Roja) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుండగుల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా యలమందకు చెందిన బాలికను ఆస్పత్రిలో పరిమర్శించేందుకు వెళ్లిన ఆమెకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న జనసేన నేతల(Janasena leaders) వ్యాఖ్యలపైనా రోజా మండిపడ్డారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రిగా పనిచేశానని, తన మీద సోషల్ మీడియాలో ఎన్ని రాశారని ప్రశ్నించారు. తమ అమ్మాయిని ఏ విధంగా వేధిస్తున్నారో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడండన్నారు. తమకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. తమను వేధించినప్పుడు పవన్ కల్యాణ్‌కు నోరు ఎక్కడికి పోయిందని అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు.
ఇక టెన్త్ బాలికను వేధించింది జనసేన కార్యకర్తలేనని రోజా ఆరోపించారు. ఇద్దరు దుండగులు బైకులు వచ్చి దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. దుండగులు వేసుకొచ్చిన బైకుపై జనసేన పార్టీ గుర్తులు, పవన్ కల్యాణ్ స్టిక్కర్లున్నాయని రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్(YS Jagan) వస్తున్నారని ఎస్పీ, తండ్రితో తప్పు జరగనట్లు స్టేట్‌మెంట్లు ఇప్పించారన్నారు. అక్కడ జరిగిన ఘటనను కవర్ చేసి బాలిక జీవితాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించారు. నేరస్తులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సపోర్ట్ చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు..