KTR:సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాజధాని(Telangana capital) హైదరాబాద్‌(Hyderabad)ను అమరావతి(Amaravati) దాటేస్తుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం(Interesting answer) చెప్పారు.

Update: 2024-11-01 08:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాజధాని(Telangana capital) హైదరాబాద్‌(Hyderabad)ను అమరావతి(Amaravati) దాటేస్తుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం(Interesting answer) చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన 'ఆస్క్ కేటీఆర్' పేరుతో ఎక్స్ వేదికగా అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలో అమరావతి తెలంగాణ రాజధానిని దాటేస్తుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు మాజీ మంత్రి కేటీఆర్(KTR) సమాధానం చెబుతూ.. ‘‘చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడని, అయితే హైదరాబాద్(Hyderabad) సొంతంగానే అభివృద్ధి(Development) చెందిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును కూడా దాటేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఉందని, కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందో తెలియదని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో పార్టీని స్థాపించిన హీరో విజయ్‌(Hero Vijay)కు కేటీఆర్ శుభాకాంక్షలు(Congratulations) చెప్పారు. 2028లో తాను మళ్లీ మంత్రిగా కనిపించే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, అక్కడ ప్రాంతీయ పార్టీలను తీసుకోవాల్సి ఉంటుందని’’ కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News