జనసేనలోకి మాజీ మంత్రి.. పవన్‌తో హైదరాబాద్‌లో మంతనాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు....

Update: 2024-01-17 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు. త్వరలో జనసేనలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. పార్టీ తరపున అనకాపల్లి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు చర్చించేందుకు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిశారు. కాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చాలకాలం పని చేశారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేగా పలు దఫాలు గెలిచారు. అయితే రా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ అనకాపల్లిలో తన మద్దతుదారులు, అనుచరులతో ఇటీవల భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. అనకాపల్లి ఎంపీ బరిలో నిలవాలని తీర్మానం చేశారు. ఈ అభిప్రాయాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కు చెప్పి అనకాపల్లి పార్లమెంట్ సీటును ఖరారు చేయించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. పార్టీలో చేరికపై చర్చిస్తున్నారు

Tags:    

Similar News